400 ఏళ్ల చరిత్ర కలిగిన శంభర పోలమాంబ

మన్యం: మక్కువ మండలం శంభర పోలమాంబ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పండగ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, సంక్రాంతి ముందు నెలగంట తరువాత పండగను చాటుతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, తెలంగాణ నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతారు.