పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం స్పూర్తిదాయకం: మంత్రి
E.G: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములును అందరూ స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.