రాజంపేటలో క్యాండిల్ ర్యాలీ

రాజంపేటలో క్యాండిల్ ర్యాలీ

KMR: రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్సై రాజు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద ప్రజలు, యువకులు భారీగా పాల్గొని అమరవీరుల త్యాగాలకు నివాళులర్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని అన్నారు.