నూతన వీధి దీపాలు ఏర్పాటు

AKP: మునగపాక మండలం మూలపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో సర్పంచ్ భీశెట్టి గంగ అప్పలనాయుడు గురువారం కొత్తవి ఏర్పాటు చేశారు. పంచాయతీలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తాగునీరు పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలన్నారు.