కేదార్‌నాథ్‌కు రోప్‌వే.. కాంట్రాక్ట్ దక్కించుకున్న అదానీ

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చింది. సోన్‌ప్రయాగ్-కేదార్‌నాథ్ మధ్య రోప్‌వే నిర్మించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్టు దక్కించుకుంది. 12.9 కిలోమీటర్ల పొడవైన ఈ రోప్‌వే నిర్మాణానికి సుమారు రూ.4,081 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే 16 కిలోమీటర్ల కష్టతరమైన ప్రయాణం కేవలం 36 నిమిషాల్లో పూర్తవుతుంది.