విజయ్‌పై వ్యాఖ్యలు.. స్పందించిన సముద్రఖని

విజయ్‌పై వ్యాఖ్యలు.. స్పందించిన సముద్రఖని

నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై సముద్రఖని స్పందించాడు. 'కార్మేని సెల్వం' ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 'విజయ్‌కు మొదట మద్దతు ఇచ్చింది నేనే, అందుకే ఆయన నిర్ణయంపై నా బాధను వెలిబుచ్చాను. నా మాటలను ఎవరో మధ్యలో రికార్డ్ చేసి తప్పుగా చూపారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా నా మనసులోని మాటను దాచుకోకుండా చెప్పాను' అని క్లారిటీ ఇచ్చాడు.