భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

ASF: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365కు సంప్రదించవచ్చని తెలిపారు.