'బంజారా భవన్ భూమిని కాపాడండి'

'బంజారా భవన్ భూమిని కాపాడండి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గుండ్లకుంట గ్రామ రెవెన్యూ శివారులో ప్రభుత్వ భూమిని బంజారా భవన్ నిర్మాణం కోసం కేటాయించారు. అయితే కొందరు అక్రమంగా కబ్జా చేయడంతో గిరిజన సంఘాల నాయకులు ఆర్డీఓ సూపరింటెండెంట్ జ్యోతిని బుధవారం కలిశారు. ప్రభుత్వం కేటాయించిన బంజారా భవన్ భూమిని ఆక్రమణ నుండి కాపాడి హద్దు బందులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.