పేదింటి బిడ్డకు బ్యాంకు కొలువు..!
SRCL: కూరగాయల వ్యాపారి కూతురు బ్యాంకు ఫలితాల్లో సత్తాచాటింది. వీర్నపల్లి(M) మండల కేంద్రానికి చెందిన దుంపటి రాజేశం-రమణల చిన్న కూతురు స్రవంతి వీర్నపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ పూర్తైన వెంటనే నంద్యాలలో కోచింగ్ పూర్తిచేసి కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం సాధించింది. చిన్న వయస్సులో ఉద్యోగం సాధించడంతో స్రవంతిని స్థానికులు ప్రశంసించారు.