ఎయిర్ పోర్ట్ కోసం 949 ఎకరాల భూమి కేంద్రానికి అప్పగింపు

ఎయిర్ పోర్ట్ కోసం 949 ఎకరాల భూమి కేంద్రానికి అప్పగింపు

వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కావలసిన 949 ఎకరాల భూమిని గురువారం కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కొండా సురేఖ,శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.