గుట్టూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ
సత్యసాయి: పెనుకొండ మండలం దుద్దెబండ, వెంకటగిరిపాళ్యం, గుట్టూరు గ్రామాలలో ఆదివారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కోరుతూ వైసీపీ నాయకులు గ్రామస్థులతో సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సుధాకర్ రెడ్డి, బోయ సాధికారికత రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రామచంద్ర పాల్గొన్నారు.