హుస్సేన్ సాగర్‌లో డెడ్‌బాడీ కలకలం

హుస్సేన్ సాగర్‌లో డెడ్‌బాడీ కలకలం

HYD: హుస్సేన్ సాగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సెక్రటేరియట్ పోలీసులు తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి సాగర్‌లో డెడ్‌బాడీ ఉన్నట్టు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకొని నీటిపై తేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించి దాన్ని బయటకు తీసి పరిశీలించారు. 35- 40 ఏళ్ల వయసు ఉంటుందని, వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.