వడగండ్ల పంట నష్టం పరిశీలన

వడగండ్ల పంట నష్టం పరిశీలన

NRPT: మద్దూరు మండలంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలను ఏవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. రేణివట్ల, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. రైతులు త్వరగా కోతలు పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి ఫంగస్ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఏఈవోలు రాకేశ్, తిరుమలేశ్ పాల్గొన్నారు.