ధర్మవరం వాసవి కలెక్షన్స్‌లో మహిళల చోరీ
సత్యసాయి: ధర్మవరంలోని వాసవి కలెక్షన్స్‌లో చోరీ జరిగింది. దుకాణంలోకి ప్రవేశించిన కొందరు మహిళలు రూ.18 వేల విలువైన వస్తువులను అపహరించారు. యజమాని అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.