తాండవ రిజర్వాయర్‌లో పెరుగుతున్న వరద ఉధృతి

విశాఖ: నాతవరం మండలంలో తాండవ జలాశయం నీటి సామర్థ్యం 380 అడుగులు కాగా 379.40 వరకు నీరు చేరింది. అవుట్ ఫ్లో 7593 క్యూసెక్కులుగా ఉంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. డీఈ అనురాధ, ఏఈలు శ్యాంకుమార్, రామకృష్ణ, వర్క్ ఇన్‌స్పెక్టర్, అప్పారావు, నాగేశ్వరరావు జలాశయాన్ని పరిశీలించారు.