మహిళా పోలీస్‌ను దూషించిన అధికారిపై కేసు నమోదు
ATP: సిటిజన్ ఈకేవైసీ ఓటీపీ కోసం ఫోన్ చేసిన మహిళా పోలీస్‌ను తాడిపత్రి ఎంఈవో-2 రామగోందరెడ్డి అసభ్యకరంగా తిట్టిన ఘటన జయనగర్ కాలనీలో జరిగింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఎంఈవో కార్యాలయానికి వెళ్లి వాగ్వాదం చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రామగోందరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.