కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
TPT: పుత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో కుంభాభిషేకం కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయంలో నవగ్రహ కలశ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ ప్రసాదాలు అందజేస్తారు.