'పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

RR: జంట జలాశయాలకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్లను ఎత్తారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1785.50 ఫీట్లకు చేరుకుంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 కాగా, ప్రస్తుతం 1763.20 చేరుకుంది. కాగా, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.