సుధీర్ 'గోట్'కు మణిశర్మ BGM
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోట్'. క్రికెట్ నేపథ్యంతో కూడిన కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సుధీర్‌కు జోడీగా దివ్యభారతి నటిస్తోంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, BGMను 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ అందించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే విడుదలైన 'ఒడియమ్మ' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.