కురిసిన వర్షం.. తడిచిన ధాన్యం
SRCL: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో సోమవారం తెల్లవారు జమున కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కప్పినా, వరద నీరు వచ్చి ధాన్యం తడిసిపోవడంతో నష్టం జరిగింది. పంట నష్టంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతుల ఆదుకోవాలని కోరారు.