కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: మాజీ ఎమ్మెల్యే
JN: కార్యకర్తలే BRS పార్టీకి పట్టుకొమ్మలు అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వేలేరు, ఇతర మండలాలకు చెందిన BRS పార్టీ నేతలు రాజయ్యతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, KCR నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.