సాగునీరు అందక రైతుల ఇబ్బందులు
ATP: గుంతకల్లు, గుత్తి బ్రాంచ్ కాలువల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. లైనింగ్ పనులు ఐదేళ్ల కిందట ఆగిపోవడంతో వేల ఎకరాలకు నీరందడం లేదు. హంద్రీనీవా నుంచి నీటి కేటాయింపులు లేకపోవడంతో ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రూ.130 కోట్లు మంజూరు చేసి కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.