NMC పేరిట ఫేక్‌ లెటర్‌.. కేంద్రం హెచ్చరికలు

NMC పేరిట ఫేక్‌ లెటర్‌.. కేంద్రం హెచ్చరికలు

MBBS విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించనున్నట్లుగా జాతీయ వైద్య కమిషన్(NMC) నోటీస్ జారీ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. NMC అలాంటి నోటీసు ఏదీ జారీ చేయలేదని వెల్లడించింది. ఇలాంటి వార్తలు షేర్ చేయొద్దని కోరింది. ఏదైనా అనుమానాస్పద కంటెంట్ మీ దృష్టికి వస్తే వాట్సాప్ నెంబర్ +918799711259 లేదా Email: factcheck@pib.gov.inని సంప్రదించాలని సూచించింది.