రామదాసుకండ్రిగలో ఎంఎస్ఎంఈ పార్కుకి శంకుస్థాపన
NLR: సర్వేపల్లి నియోజకవర్గంలోని రామదాసుకండ్రిగ గ్రామంలో రూ.100 కోట్ల వ్యయంతో నూతన నిరమిచ్చనున్న ఎంఎస్ఎంఈ పార్కుకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా వీసీ ద్వారా వీక్షించారు.