VIDEO: కంభంలో చోరీకి పాల్పడిన దుండగులు
ప్రకాశం: కంభం పట్టణంలోని భాగ్యనగర్ రెండవ లైన్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారం, నగదును దోచుకొని వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.