సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 21 మంది లబ్ధిదారులకు రూ. 36 లక్షల చెక్కులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.