VIDEO: రోడ్లపై పశువులతో ప్రమాదాలు

VIDEO: రోడ్లపై పశువులతో ప్రమాదాలు

VSP: ఇటీవల కాలంలో పశువులు రోడ్లపైనే తచ్చాడుతున్నాయని, వీటివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశముందని కొయ్యూరు ఎస్సై కిషోర్ వర్మ సోమవారం అన్నారు. రాత్రిళ్లు కూడా పశువులను రోడ్లపైనే వదిలేయడం వల్ల సెల్ఫ్ ఏక్సిడెంట్స్ అవుతున్నాయన్నారు. పశువుల యజమానులు, కాపర్లు రాత్రి వేళల్లో పశువులను కట్టి ఉంచాలని సూచించారు. హైవేపైకి పశువులు రావడం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు.