VIDEO: కంచరపాలెంలో జీవీఎంసీ లారీ బీభత్సం.. వ్యక్తి మృతి
VSP: కంచరపాలెం సర్వీస్ రోడ్డులో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న చెత్త తరలించే జీవీఎంసీ లారీ అదుపు తప్పి బస్టాప్‌ను బలంగా ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం..ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్‌స్టాప్ షెల్టర్ ధ్వంసమైందని, ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.