దేవాలయాల పునఃనిర్మాణానికి భారీగా నిధులు: ఎమ్మెల్యే
కోనసీమ: మండపేట నియోజకవర్గంలోని పలు దేవాలయాల పునఃనిర్మాణానికి CGF నుంచి భారీగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. కోరుమిల్లిలోని శ్రీ జనార్థనస్వామి ఆలయానికి రూ.1.80 కోట్లు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు కేటాయించామన్నారు. అలాగే, మాచర గ్రామంలోని శ్రీ జనార్ధనస్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయన్నారు.