'ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి'
కోనసీమ: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో శనివారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆయన ముమ్మిడివరం మండలం రాజుపాలెం రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోలు సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.