అనాథలైన దివ్యాంగులకు ఆర్థిక సహాయం

ADB: కన్నవారి మృతితో అనాథలైన దివ్యాంగులకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు ఏవో సోమలింగారెడ్డి కుంటాలకు చెందిన సాంగి హంస నాలుగేళ్ల క్రితం, శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి పిల్లలు అక్షయ, అనుప్రియ అనాథలయ్యారు. గురువారం ఏవో సోమలింగారెడ్డి రూ.10వేల నగదును అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జారాం యాదవ్, ఏఈవోలు పాల్గొన్నారు.