ఘోర రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: వేమిరెడ్డి

NLR: పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు.