మహిళల కోసం ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనం ప్రారంభం
VZM: కలెక్టరేట్‌లో మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైన్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీస్, చట్ట సహాయం, కౌన్సెలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు తెలిపారు.