డ్రైన్‌లో శిశువు మృతదేహం కలకలం
కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బొమ్మిడిపాలెం వాడబోది డ్రైన్‌లో వారం రోజుల మగ శిశువు మృతదేహం ఆదివారం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఎస్సై చైతన్య కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.