రొయ్యల చెరువులతో కలుషితం అవుతున్న నీరు
AKP: పాయకరావుపేట మండలం తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన చేపలు రొయ్యల చెరువుల వల్ల నీరు కలుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వెంకటనగరం సర్పంచ్ వెంకటరమణ అన్నారు. పాయకరావుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ పార్వతి అధ్యక్షతన జరిగింది. అలాగే మంగవరం పీహెచ్సీలో అవసరమైన మందులు అందుబాటులో లేవని ఎంపీటీసీ సతీష్ రాజు తెలిపారు.