'20న ఆల్ ట్రేడ్స్ సమ్మెను జయప్రదం చేద్దాం'

MBNR: ఈనెల 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించబోయే ఆల్ ట్రేడ్స్ సమ్మెను జయప్రదం చేద్దామని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కురుమూర్తి, వెంకటేష్, రాములు యాదవ్ పాల్గొన్నారు.