నేడు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా : కమిషనర్
VZM: రాజాం పట్టణంలో బుధవారం వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ రామచందర్రావు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేగడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను పని ఇంకా జరుగుతుండడంతో ట్యాంకర్స్ ద్వారా పట్టణంలో నీటిని సరఫరా చేస్తామన్నారు. పైప్ లైన్ పనులు అయిన వెంటనే కొళాయిలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.