బీహార్‌లో మార్పు మొదలైంది: కాంగ్రెస్ నేత
బీహార్‌లో నిన్న జరిగిన తొలిదశ పోలింగ్‌పై కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రసాద్ సింగ్ స్పందించారు. మహాఘఠ్‌బంధన్ అభ్యర్థులు 75కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరో 20 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు. బీహార్‌లో మార్పు తరంగం కొనసాగుతోందని, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని తెలిపారు.