ఎరువుల షాపులను తనిఖీ చేసిన అధికారులు

ఎరువుల షాపులను తనిఖీ చేసిన అధికారులు

GNTR: తెనాలిలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారులతో కలిసి షాపుల్లోని స్టాక్ రికార్డులను పరిశీలించారు. మార్కెట్ యార్డులోని గోదాములను సందర్శించి, రైతులకు ఫోన్ చేసి ఎరువుల సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్ పాల్గొన్నారు.