సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి
కృష్ణా: గుడివాడలో పనిచేస్తున్న ఆర్పీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్‌కు సోమవారం మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీపీ రెడ్డి ఆర్పీలకు మద్దతు తెలిపారు. ఆర్పీలకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.