బంట్వారంలో ముగిసిన మల్లికార్జున స్వామి జాతర

బంట్వారంలో ముగిసిన మల్లికార్జున స్వామి జాతర

VKB: బంట్వారం మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పల్లకి సేవ, స్వామివారి కళ్యాణం, బోనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉత్సవాలు విజయవంతంగా పూర్తి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.