మొదటి విడత ఎన్నికలను పరిశీలించిన కలెక్టర్
JGL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ బుధవారం మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ,ఇబ్రహీంపట్నం మండలాల్లో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది బాధ్యతలు, లాజిస్టిక్స్, మెటీరియల్ పంపిణీ,భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, బి.రాజ గౌడ్ ఉన్నారు.