VIDEO: ఘోరం.. టపాసులను కాల్చిన చిన్నారులకు తీవ్రగాయాలు
W.G: దీపావళి టపాసులను గ్యాస్ పొయ్యిపై పెట్టి కాల్చడంతో పేలిపోయి ఓ బాలుడి చేయి మణికట్టు వరకు తెగిపడింది. ఈ ఘటన మొగల్తూరులోని నాగదేవత కాలనీలో మంగళవారం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో బాబి (7), అసబు (11) అనే చిన్నారులు మిగిలిపోయిన బాణాసంచాను గ్యాస్‌పై పెట్టి అంటించారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఇద్దరూ గాయపడ్డారని స్థానికులు తెలిపారు.