విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: 33/11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా బుధవారం సిరిసిల్ల పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సెస్ ఏఈ రుషిక తెలిపారు. సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని అంబికా నగర్, వెంకంపేట, అశోక్ నగర్, సర్దార్ నగర్, పద్మనగర్, ప్రగతి నగర్‌లో ఉదయం 6:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.