బాధిత కుటుంబానికి 2 లక్షల చెక్కు అందజేత

తూ.గో: పల్లూరు గ్రామానికి చెందిన మడకం రాజు గతంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పథకంలో చేరాడు. అయితే మార్చి నెలలో ప్రమాదవశాత్తు అతడు చనిపోవడంతో ఈ నెలలో ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. మంగళవారం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ కూనవరం బ్రాంచ్ మేనేజర్ శోభ రవికుమార్ 2 లక్షల రూపాయల చెక్కును అతడి భార్య రామమ్మకు అందజేశారు.