నేడు మండలంలో పర్యటించనున్న MLA

నేడు మండలంలో పర్యటించనున్న MLA

KMM: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం మణుగూరు, కరకగూడెం మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు మణుగూరు జడ్పీ హైస్కూల్ నందు నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30కు కరకగూడెం మండలం బట్టుపల్లి రైతువేదిక నందు రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తారు. సాయంత్రం 3 గంటలకు అశోక్ నగర్ లో DCCB బ్యాంకును ప్రారంభిస్తారు.