సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మృతి
W.G: సీపీఎం ఏలూరు జిల్లా పూర్వ కార్యదర్శి, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చింతకాయల బాబురావు (60) గురువారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఆయన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.