నేడు పవర్ కట్..!

నేడు పవర్ కట్..!

VSP: ఎంవీపీ కాలనీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 11 కేవీ ఫీడర్ నిర్వహణ పనుల దృష్ట్యా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని APEPDCL ఈఈ పి.శ్రీనివాసరావు తెలిపారు. సెక్టార్-2, 3, 6, కొత్త వెంకోజీపాలెం, అజయ్ నగర్ ఆస్పత్రి పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.