ఈత సరదా ప్రాణాలు తీసింది..!

RR: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని మూసీ నదికి బీటెక్ చదువుతున్న విద్యార్థి అక్షిత్ రెడ్డి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈత కొడదామని ముగ్గురు మూసీలో దిగారు. ప్రమాదవశాత్తు అక్షిత్ నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.