పత్తి చేనులో గంజాయి సాగు
VKB: తాండూరు పరిధి బర్వాద్ గ్రామంలో పెంటయ్య అనే రైతు పత్తి చేనులో సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలను ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ కేసులో ఇద్దరి ప్రమేయం ఉండగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.